సల్మాన్ ఖాన్‌ను పొగిడినందుకే టైగర్ ష్రాఫ్‌పై కాల్పులా? బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడి వాంగ్మూలంతో కొత్త కోణం!
Advertisement
- సల్మాన్‌ను పొగిడినందుకే టైగర్‌పై దాడి జరిగిందని నిందితుడి వాంగ్మూలం
- 2022లో హీరోపంతి 2 ప్రచార కార్యక్రమంలో సల్మాన్‌పై టైగర్ ప్రశంసలు
- ‘‘ఈ ఇండస్ట్రీలో ఒకే ఒక్క టైగర్.. అతనే సల్మాన్’’ అని అన్నట్లు సమాచారం.
- అప్పట్లో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్
Advertisement
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. 2022లో ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో నటుడు సల్మాన్ ఖాన్‌ను ప్రశంసించినందుకే టైగర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన నిందితుల్లో ఒకరు పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది.
టైగర్ ష్రాఫ్ నటించిన ‘హీరోపంతి 2’ సినిమా ప్రమోషన్ సందర్భంగా 2022లో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈద్ సందర్భంగా సినిమా విడుదల గురించి అడిగినప్పుడు.. ‘‘ఈ ఇండస్ట్రీలో ఒకే ఒక్క టైగర్ ఉన్నాడు. అతనే సల్మాన్ సర్. ఆయన ముందు నేను పిల్లిలాంటి వాడిని. నేను సింబా.. పులి పిల్లను’’ అని టైగర్ అన్నట్లు సమాచారం. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలే దాడికి ఒక కారణమై ఉండవచ్చని నిందితుడు విచారణలో చెప్పినట్లు పోలీసు వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అక్టోబర్ 18న ముంబైలోని జుహు ప్రాంతంలో ఫుట్‌బాల్ ఆడిన తర్వాత కారులో వెళ్తున్న టైగర్‌పై దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అతడి బీఎండబ్ల్యూ కారుపై ఏడు రౌండ్లు కాల్పులు జరిపి, బైక్‌పై అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో టైగర్ డ్రైవర్‌తో పాటు ఓ పాదచారికి గాయాలయ్యాయి. టైగర్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. ఘటన తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తి దాడికి బాధ్యత వహిస్తూ ఆడియో సందేశం విడుదల చేశారు. సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసేవారిని లక్ష్యంగా చేసుకుంటామని అందులో హెచ్చరించినట్లు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ముగ్గురిని రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్ వద్ద రైలులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పోలీసుల కదలికల గురించి సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ కాల్స్ ద్వారా సమాచారం పొందినట్లు దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారిపోయేందుకు వారు బైక్‌లు, రైళ్లు, క్యాబ్‌లను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. క్యాబ్ డ్రైవర్‌కు చేసిన సాధారణ ఫోన్ కాల్ వారి ప్రయాణ మార్గాన్ని గుర్తించడంలో కీలకంగా మారింది. ఈ కేసులో ఆయుధాల సరఫరాకు సంబంధించి మరో ముగ్గురు మహిళలను కూడా అరెస్టు చేశారు.